కుప్పంలో కర్ణాటక పోలీసుల భారీ నగదు స్వాధీనం

7814చూసినవారు
బెంగళూరులో దోపిడీకి గురైన 7 కోట్ల రూపాయల నగదును కర్ణాటక పోలీసులు కుప్పంలో స్వాధీనం చేసుకున్నారు. కూర్మానుపల్లెకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నవీన్ ఈ దోపిడీ కేసులో నిందితుడిగా గుర్తించబడ్డాడు. కర్ణాటక పోలీసులు, కుప్పం పోలీసుల సహకారంతో కూర్మాయిపల్లిలోని నవీన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. తాళం వేసి ఉన్న ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన పోలీసులు, అక్కడ సుమారు 5.56 కోట్ల రూపాయల నగదును రికవరీ చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్