కుప్పం: తమకు న్యాయం చేయాలని కన్నీటిపర్యంతమైన మహిళలు

3చూసినవారు
కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, మఠం గ్రామంలో భూ వివాదం నెలకొంది. ఇ. బాబు నాయుడు కుమార్తెలైన దివ్యభారతి, రూప తమ కుటుంబానికి చెందిన రెండున్నర ఎకరాల భూమిపై అధికారులు అన్యాయం చేస్తున్నారని శనివారం తెలిపారు. తమ తండ్రి పేరుపై వన్-బి, ఆన్లైన్ అడంగల్ సహా అన్ని భూ రికార్డులు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ఆర్డీఓ భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్