కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలంలో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ధాటికి రైతులు కష్టపడి పండించిన అరటి, బొప్పాయి, దోస, మామిడి పంటలు నేలకూలాయి. గాలి వానతో పాటు వడగండ్లు కూడా పడడంతో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని బాధిత రైతులు శనివారం తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.