కుప్పం మండలం, కూర్మాయపురంలో సోమవారం అన్నదమ్ముల మధ్య దారి సమస్యతో గొడవ జరిగింది. ఓ వర్గం వారు దారిని ఆక్రమించుకొని పొలాల మీదుగా వెళ్లాలని అనడంతో ఇరువర్గాలు ఘర్షణ పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.