కుప్పంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బిజెపి, హిందూ సంఘాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కుప్పం డి.ఎస్.పి పార్థసారథి తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.