కుప్పం మున్సిపల్ పరిధిలోని డికెపల్లి చెరువులో శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు కుప్పం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలిసినవారు కుప్పం పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.