కుప్పంలో మెడికల్ విద్యార్థి మృతి

4చూసినవారు
కుప్పంలో మెడికల్ విద్యార్థి మృతి
కుప్పం PES మెడికల్ కాలేజీలో అనస్థీషియా ఫస్ట్ ఇయర్ విద్యార్థి హర్షవర్ధన్ (25) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అనంతపురానికి చెందిన హర్షవర్ధన్ హాస్టల్ గదిలో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని తోటి విద్యార్థులు గుర్తించారు. అతనికి సీపీఆర్ చేస్తుండగా కార్డియాక్ అరెస్ట్ తో మృతిచెందినట్లు సమాచారం. హైడోస్ ఇంజెక్షన్ వేసుకోవడం వల్లే కార్డియాక్ అరెస్ట్ జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.