కుప్పం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, రాళ్ల బుదుగురు తదితర ప్రదేశాలలో మంగళవారం పీడీ వికాస్ పర్యటించారు. ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రోగులకు వైద్యుల సేవలపై ఆరా తీశారు. కర్లగట్ట సచివాలయం, పరమ సముద్రంలోని పరిశ్రమ నిర్మాణ పనులను పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కుప్పం ప్రాంత అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.