కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలంలో రైతుల పంటలను ధ్వంసం చేస్తూ అపార నష్టం కలిగించిన జంట ఏనుగులను మంగళవారం రాత్రి అటవీ సిబ్బంది ననియాల అటవీ ప్రాంతంలోకి మళ్ళించారు. నెల రోజులకు పైగా ఈ ఏనుగులు ననియాల, పెద్దూరు, ఆదిమాని పెంట పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఏనుగులు అడవిలోకి వెళ్ళడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.