కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలంలో మూడు రోజులుగా వీస్తున్న భారీ ఈదురుగాలుల కారణంగా వరి పంటకు అపార నష్టం వాటిల్లింది. మంగళవారం బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం, అకాల వర్షాలు కూడా అరటి, బొప్పాయి, మామిడి వంటి పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి. అధికారులు తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.