
కుప్పంలో పరిశ్రమల శంకుస్థాపన వాయిదా
కుప్పంలో 7 పరిశ్రమల ఏర్పాటుకు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయాల్సిన కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. రాష్ట్రంలో తుఫాను ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ రెండవ వారంలో సీఎం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ వాయిదా వల్ల పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియలో స్వల్ప జాప్యం ఏర్పడనుంది.





































