
కుప్పం: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: మాజీ ఎమ్మెల్సీ
శాంతిపురంలో 'ఆదాయ అవకాశాలు మహిళల కోసం' అనే అంశంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసుల మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబాలు బాగుపడతాయని, మహిళా అభ్యున్నతికి సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఇంటికి ఒక మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయాలని సీఎం చంద్రబాబు మహిళలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.





































