
చిత్తూరు: జిల్లా కలెక్టర్ కు 6వ ర్యాంకు
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు 1,555 ఫైల్స్ స్వీకరించి, 1,421 ఫైల్స్ ను క్లియర్ చేశారు. ప్రతి ఫైల్ ను సగటున 6 గంటల వ్యవధిలోనే పరిష్కరించారు. ఈ పనితీరుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు, సుమిత్ కుమార్ కు రాష్ట్రంలో 6వ ర్యాంకు కల్పించారు. రాష్ట్రంలోనే అత్యధిక ఫైల్స్ స్వీకరించి, క్లియర్ చేసిన వారిలో ఆయన ముందున్నారు.






































