
మదనపల్లె: ఆత్మహత్యకు యత్నించిన యువకుడు మృతి
శుక్రవారం తిరుపతిలో మదనపల్లెకు చెందిన శివ (24) అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకుని మృతి చెందారు. ఉద్యోగం మానేసి చెడు వ్యసనాలకు బానిసవుతున్న అతన్ని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషం తాగారు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.





































