విద్యార్థులకు ఉచిత హాకీ కిట్లు, చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత: డీఎస్పీ పావని

1243చూసినవారు
విద్యార్థులకు ఉచిత హాకీ కిట్లు, చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత: డీఎస్పీ పావని
అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ఆరోగ్య మాత స్కూల్‌లో గురు హాకీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సమ్మర్ క్యాంప్‌లో భాగంగా, సీనియర్ రాష్ట్ర నాయకులు కట్టా దొరస్వామి నాయుడు సమక్షంలో డీఎస్పీ పావని విద్యార్థులకు హాకీ పరికరాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ పావని, విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ, చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గురు భాస్కర్, ప్రసాద్ రెడ్డి, మేరీ పునీత, కోచ్‌లు నౌషాద్, గౌస్, సుల్తాన్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆమె పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you