Feb 22, 2026, 16:02 IST/జగిత్యాల
జగిత్యాల
మస్కట్లో అనారోగ్యంతో కథలాపూర్ యువకుడు మృతి
Feb 22, 2026, 16:02 IST
కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామానికి చెందిన లోలపు శ్రీనివాస్ (40) మస్కట్లో అనారోగ్యంతో మృతిచెందారు. కుటుంబ పోషణ కష్టంగా మారడంతో మూడు నెలల క్రితం ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లారు. అక్కడ అనారోగ్యంతో బాధపడుతుండగా తోటి మిత్రులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం మృతిచెందినట్లు ఆదివారం కుటుంబసభ్యులకు సమాచారం అందింది. మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.