నాగలపురం మండలం - Nagalapuram Mandal

జగిత్యాల జిల్లా
హోమ్ లోన్ తీరిందా? ఈ పనులు వెంటనే చేయండి!
Jan 08, 2026, 16:01 IST/

హోమ్ లోన్ తీరిందా? ఈ పనులు వెంటనే చేయండి!

Jan 08, 2026, 16:01 IST
చాలా మంది ఎంతో కష్టపడి హోమ్ లోన్ తీరుస్తారు. అయితే, లోన్ పూర్తయిన వెంటనే ఆస్తిపై పూర్తి యాజమాన్య హక్కు లభించదు. లోన్ తీరిన తర్వాత, బ్యాంకు వద్ద ఉన్న ఆస్తి అసలు పత్రాలను (టైటిల్ డీడ్, సేల్ డీడ్, లోన్ అగ్రిమెంట్ వంటివి) తిరిగి తీసుకోవాలి. బ్యాంకులు సాధారణంగా లోన్ పూర్తయిన 15 రోజుల్లోపు ఈ పత్రాలను అందిస్తాయి. అలాగే, 'నో డ్యూస్ సర్టిఫికేట్' పొందాలి, ఇది మీరు మొత్తం రుణం చెల్లించారని రుజువు చేస్తుంది. ఆ తర్వాత, రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి మీ ఆస్తిపై బ్యాంకు హక్కును తొలగించుకోవాలి. అప్పుడే మీకు ఆస్తిపై పూర్తి యాజమాన్యం లభిస్తుంది.