నగరి - Nagari

వీడియోలు


జగిత్యాల జిల్లా
కరీంనగర్ లో ఆకలి చావు ఘటన కలకలం
Mar 13, 2026, 14:03 IST/

కరీంనగర్ లో ఆకలి చావు ఘటన కలకలం

Mar 13, 2026, 14:03 IST
గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో కల్వకోట విజేందర్ రావు (78) అనే వృద్ధుడు ఆకలితో మృతి చెందడం కలకలం రేపింది. ఒకప్పుడు ఆర్థికంగా బలంగా ఉండి, పలువురికి సహాయం చేసిన విజేందర్ రావు, కాలక్రమేణా కుటుంబ పరిస్థితులు మారడంతో ఒంటరిగా జీవిస్తూ, వయసు పైబడటం, ఆర్థిక ఇబ్బందుల వల్ల సరైన ఆహారం దొరకక ఆకలితో అలమటించి మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని, సరైన ఆదరణ లేకపోవడం, వృద్ధాప్య సమస్యలు కూడా కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటన గ్రామంలో విషాద వాతావరణాన్ని నెలకొల్పింది.