నగరిలో లారీ బోల్తా

4956చూసినవారు
బుధవారం నగరి పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బద్వేల్ నుంచి కాంచీపురం వెళ్తున్న ధాన్యం లోడుతో ఉన్న లారీ, రాజీవ్ నగర్ సబ్స్టేషన్ వద్ద వన్ వేలో వెళుతుండగా, ఎదురుగా వచ్చిన కారును తప్పించే క్రమంలో డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్