ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి, పరిశ్రమల అభివృద్ధి కమిటీ సభ్యులుగా నియమితులైన ఎన్.మురళీమోహన్ చినబాబును నగరి మండలం బిజెపి నాయకులు మంగళవారం తిరుపతిలో ఘనంగా సత్కరించారు. చినబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, బిజెపి నగరి మండలం జనరల్ సెక్రెటరీ సౌందర్ పాండి, బిజెపి ఎక్స్ మండల ప్రెసిడెంట్ పొన్నప్పన్, మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.