నగరి మున్సిపాలిటీ పరిధిలోని నెత్తం కండ్రికకు చెందిన గంగాధర్ బాబుకు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 6 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయించారు. చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగాధర్ బాబుకు ఈ మొత్తాన్ని నేరుగా వైద్యశాలకు అందేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సిఫార్సుతో దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే ఈ సహాయం మంజూరు కావడం విశేషం. ఆపదలో ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.