పుత్తూరు డిగ్రీ కళాశాలలో ఉచిత నైపుణ్య శిక్షణ

5చూసినవారు
పుత్తూరు డిగ్రీ కళాశాలలో ఉచిత నైపుణ్య శిక్షణ
పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్కిల్ హబ్ సెంటర్లో అప్లికేషన్ డెవలపర్ వెబ్ మరియు మొబైల్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి. చంద్రమౌళి బుధవారం తెలిపారు. ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై 15 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ శిక్షణకు అర్హులని ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు కళాశాలలోని స్కిల్ హబ్ సెంటర్లో సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్