రామక్కమ్మ ఆలయ నిర్మాణానికి గీతాశ్రమ పీఠాధిపతి ఆశీస్సులు

1024చూసినవారు
రామక్కమ్మ ఆలయ నిర్మాణానికి గీతాశ్రమ పీఠాధిపతి ఆశీస్సులు
నగరి నియోజకవర్గం, విజయపురం మండలం, కోసలనగరం గ్రామంలో నూతనంగా రామక్కమ్మ ఆలయం నిర్మించాలని సంకల్పించారు. ఈ మేరకు కూనమరాజుపాళెం గీతాశ్రమ పీఠాధిపతి శ్రీ పుండరీక వరదానంద స్వామి వారిని పిలిపించారు. స్వామివారు స్థలాన్ని పరిశీలించి, ఆశ్రమానికి ఎదురుగా అన్నదానం నిర్వహిస్తున్న స్థలం అనుకూలమైనదని తెలిపారు. త్వరలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని రామక్కమ్మ ఆశ్రమ నిర్వాహకులు వాసుదేవ స్వామి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్