నగరిలో శనివారం జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో జన విశ్వాష్ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో, మహిళల భద్రత, రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చట్టాలపై మహిళలకు వివరించారు.