నగరిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన విలేకరులు

3చూసినవారు
చిత్తూరు జిల్లా, వి. కోట మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యకు గురికావడంతో పాత్రికేయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మంగళవారం, నగరి నియోజకవర్గంలోని విలేకరులు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించి, పాత్రికేయులకు రక్షణ కల్పించాలని నినదించారు. అనంతరం ఎస్సై వెంకట సురేష్ కు వినతిపత్రం అందించారు. నగరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుబ్రమణ్యం మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే జర్నలిస్టును హత్య చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్