సోమవారం, నగరి నియోజకవర్గం నిండ్రలో జరిగిన జిల్లాస్థాయి పిజిఆర్ఎస్ కార్యక్రమానికి 98 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. వీటిలో రెవెన్యూకు 16, భూములకు 36, పోలీసు 11, పంచాయతీ రాజ్ 7, ఇంజినీరింగ్ 6, నగరి అడ్మినిస్ట్రేషన్ పై 5 ఫిర్యాదులున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.