నగరి రూరల్ మండలం, మిట్టపాలెం పంచాయతీ, చిన్న తంగల్ గ్రామంలో 'రైతన్నా - మీకోసం కార్యక్రమం'లో నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. సోమవారం ఆయన ప్రతీ రైతు ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి సందేశ పత్రాన్ని అందజేశారు. రైతులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ శాఖ పథకాలను వివరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.