నగరి: డైయింగ్ యూనిట్లపై అధికారుల దాడి

0చూసినవారు
నగరిలోని సత్రవాడలో నిబంధనలు పాటించకుండా పనిచేస్తున్న డైయింగ్ యూనిట్‌ను మున్సిపల్ కమిషనర్ బాలాజినాయక్ మంగళవారం సీజ్ చేశారు. కాలువల్లో రసాయన రంగునీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యుల ద్వారా సమాచారం అందించారు. దీంతో కమిషనర్ సిబ్బంది, పోలీసులతో కలిసి ఆకస్మిక దాడి చేసి, యూనిట్ నిర్వహణకు ఉపయోగించే జనరేటర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్