నగరి: పట్టణంలో 'పుష్ప2' హంగామా

84చూసినవారు
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప-2 సినిమా గురువారం విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరి పట్టణంలోని ఎన్ ఎం సి థియేటర్ వద్ద అల్లు అర్జున్ అభిమానులు హంగామా చేశారు. బుధవారం అర్ధరాత్రి ఫ్యాన్స్ షో ప్రదర్శించారు. ఈ సందర్భంగా డ్రమ్స్ కు డాన్సులు వేస్తూ అభిమానులు సందడి చేశారు. జై అల్లు అర్జున్ అంటూ నినాదాలు చేసారు.

సంబంధిత పోస్ట్