గురువారం పుత్తూరు పట్టణంలోని కాపు వీధిలో ఉన్న ఐటీసీ కంపెనీ గోడౌన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చాక్లెట్లు, గోధుమపిండి, సిగరెట్లు వంటి వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. పుత్తూరు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ ఘటనలో సుమారు 5 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు పద్మనాభ శెట్టి, ఆయన కుమారులు తెలిపారు.