పుత్తూరు మండలం, ఎగువ కనకపాలెం పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ నాయకుడు మహేష్ అధికారులను కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, గత పది రోజులుగా కాలనీవాసులు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామంలో వీధి దీపాలు, డ్రైనేజ్ సమస్యలు కూడా ఉన్నాయని, వీటిని పరిష్కరించకపోతే సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.