అల్పపీడన ప్రభావంతో చిత్తూరు జిల్లాలోని 25 మండలాల్లో బుధవారం తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. నిండ్రలో అత్యధికంగా 74.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కార్వేటి నగరం, వెదురుకుప్పం, పెనుమూరు, ఎస్ఆర్ పురం, నగరి, పూతలపట్టు, ఐరా, బంగారుపాళ్యం వంటి మండలాల్లోనూ గణనీయమైన వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గుడిపాలలో అత్యల్పంగా 1 మి.మీ వర్షం కురిసింది.