లిక్కర్ స్కాంపై దర్యాప్తులో భాగంగా, పుత్తూరులో మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ నేత నారాయణ స్వామి నివాసంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సిట్ విచారణ సాయంత్రం వరకు కొనసాగింది. ఈ విచారణలో భాగంగా నారాయణ స్వామిని సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం నారాయణ స్వామి మాట్లాడుతూ తనపై కొన్ని మీడియా ఛానల్స్ అసత్య ప్రచారం చేస్తున్నాయని తెలిపారు.