నిండ్రలో శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి

1236చూసినవారు
నగరి నియోజకవర్గంలోని నిండ్ర ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం శ్రీవాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గాలిభాను ప్రకాశ్ హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి, వాసిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాసిరెడ్డి ప్రజాహిత పాలన, ధార్మికత, అభివృద్ధి దృక్పథం నేటి తరాలకు మార్గదర్శకమని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్