విజయపురం: బస్ షెల్టర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే భాను

6చూసినవారు
విజయపురం: బస్ షెల్టర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే భాను
నగరి నియోజకవర్గం, విజయపురం మండలం ఆమగుంటలో రూ. 2.50 లక్షల వ్యయంతో నిర్మించిన బస్ షెల్టర్‌ను నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని, ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను వేగంగా కల్పించడం తనకు ఆనందాన్నిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్