Jan 29, 2026, 14:01 IST/ధర్మపురి
ధర్మపురి
పత్రికా దినోత్సవం: మీడియాల పాత్ర కీలకమన్న సముద్రాల రమేష్
Jan 29, 2026, 14:01 IST
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని పీఎస్ఆర్ సర్కిల్ వద్ద జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఆర్య వైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల రమేష్ గుప్త కేక్ కట్ చేసి, పండ్లు, ఫలాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో పత్రికలు, మీడియాలు కీలక పాత్ర పోషించాయని, అందరూ మీడియాలను గౌరవించాలని, నిజాలను నిర్భయంగా ఆధారాలు సేకరించి వాటిని బట్టబయలు చేయాలని విజ్ఞప్తి చేశారు.