పలమనేరు మండలం - Palamaner Mandal

జగిత్యాల జిల్లా
ఖైరతాబాద్ కు ఉపఎన్నిక.. సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్!
Jan 15, 2026, 17:01 IST/

ఖైరతాబాద్ కు ఉపఎన్నిక.. సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్!

Jan 15, 2026, 17:01 IST
TG: రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌ క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తోపాటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్‌ అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ విషయంలో దానంపై వేటు పడటం ఖాయమని.. బీఆర్ఎస్ అంచనా వేస్తోందట. దీంతో ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక రానుందని.. బలమైన అభ్యర్థి కోసం సెర్చ్ చేస్తోందట గులాబీ పార్టీ. ఈ ఉప ఎన్నిక బరిలో తన కుమారుడు సాయికిరణ్‌ ను దించాలని తలసాని భావిస్తున్నారట.