బైరెడ్డిపల్లి మండలం కుప్పనపల్లిలో 16 మేక పిల్లలను బండకేసి కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది. స్థానికంగా ఉంటున్న పాండు అనే వ్యక్తిపై బాధితులు అనుమానం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాగే తమ పొట్టేళ్లను చంపి వండుకొని తిన్నాడని బాధితులు ఆరోపించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బైరెడ్డిపల్లి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.