బైరెడ్డిపల్లి: చెరువులో పడి వ్యక్తి గల్లంతు

14చూసినవారు
పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లి మండలం, పెద్దచెరువులో దిగి కృష్ణప్ప (58) గల్లంతైనట్లు స్థానికులు బుధవారం తెలిపారు. వారి వివరాల మేరకు కృష్ణప్ప ఆయన మిత్రుడు సైదులుసాబ్ చెరువు వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో సైదులుసాబ్ గట్టుపై ఉండగా, కృష్ణప్ప చెరువులోకి ఈత కొట్టడానికి వెళ్ళగా లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయినట్టు తెలిపారు. కృష్ణప్ప ఆచూకీ కోసం చెరువులో గాలింపు చేపట్టారు. ఈ చెరువులో ఈ మధ్యకాలంలో మట్టిని తొడటంతో ఎక్కువ లోతు ఏర్పడిందని స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్