చిత్తూరు జిల్లా పలమనేరు పీఎస్‌లో భర్త వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఓ వివాహితను హోంగార్డు మానసికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం, బంగారుపాళ్యం పీఎస్‌లో పనిచేసే కానిస్టేబుల్‌ను సహాయం కోరగా, అతను తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు వాపోయింది. ఈ ఘటనపై బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేయగా, నిందితులైన ఇద్దరు పోలీసులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ డేగల ప్రభాకర్ వెల్లడించారు.