పెద్దపంజాణి మండలం వీరపల్లె కొండపై గుప్తనిధుల కోసం అర్ధరాత్రి తవ్వకాలు జరుగుతుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ఏడుగురిని అరెస్టు చేసినట్లు సమాచారం. తవ్వకాలకు ఉపయోగిస్తున్న జేసీబీతో పాటు కారు, నాలుగు బైకులు, పూజా సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ముగ్గురు పుంగనూరు మండలానికి చెందినవారు కాగా, మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.