రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పలమనేరు గంగ జాతరలో భాగంగా గురువారం రాత్రి గంగ చాటు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి, ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పలమనేరు డి.ఎస్.పి డేగల ప్రభాకర్ పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.