బంగారుపాళ్యం మండలం చంద్రశేఖరపురం సమీపంలో అక్రమ శిశు లింగ నిర్ధారణ
పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు, వైద్యశాఖ అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. స్కానింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్ట్ చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి గర్భీణులను రప్పించి డబ్బులు వసూలు చేస్తూ
పరీక్షలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.