పలమనేరులో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాదాపు అరగంట పాటు కురిసిన ఈ వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో నియోజకవర్గంలోని చెరువులన్నీ నిండుగా మారాయి. ఖరీఫ్ సీజన్‌లో నీటి కొరత ఉన్నప్పటికీ, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.