పలమనేరులో జరుగుతున్న గంగ జాతర మహోత్సవంలో భాగంగా, బుధవారం ఆరవ రోజు గంగమ్మకు వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలు, వేపాకు మండలతో అద్భుతమైన అలంకరణ చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహా మంగళ హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను నిర్వాహకులు అందజేశారు.