వీకోటలో విలేకరి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం శ్రీగంధం చెట్ల దొంగల అరెస్టులో కీలకపాత్ర పోషించినందున, వారే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని చర్చ జరుగుతోంది. కాగా జైలుకు వెళ్లిన వ్యక్తి ఇటీవల జైలు నుంచి విడుదలవడంతో అతనే ఈ హత్య వెనుక ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.