పూతలపట్టు మండలంలో ఒక వ్యక్తి, టీడీపీ కార్యకర్తల వల్ల తనకు ప్రాణహాని ఉందని సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన ఘటనపై డీఎస్పీ సాయినాథ్ మంగళవారం వివరణ ఇచ్చారు. నిందితుడు దినేశ్ మద్యం తాగి రోడ్డుపై పడిపోగా, సహాయం చేయడానికి ప్రయత్నించిన స్థానికులపై దాడి చేశాడని, పోలీసుల వద్ద కూడా హల్చల్ చేశాడని తెలిపారు. దీనిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.