శుక్రవారం పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాణి మండలం, రామాపురం గ్రామ సమీపంలో చెన్నై నుంచి అనంతపురం వెళుతున్న కంటైనర్ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పెద్దపంజాణి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.