పలమనేరు: పి జి ఆర్ ఎస్ కు 72 ఫిర్యాదులు

1చూసినవారు
పలమనేరు: పి జి ఆర్ ఎస్ కు 72 ఫిర్యాదులు
పలమనేరు డిఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి 72 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను సవివరంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో, సంబంధిత అధికారులు సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గాలు చూపాలని ఎస్పీ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్