పలమనేరు: ఒంగోలు వద్ద ప్రమాదం, పత్తికొండ లైన్మెన్ మృతి

2087చూసినవారు
ఆదివారం రాత్రి ఒంగోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగవరం మండలంలోని పత్తికొండలో పనిచేసే జూనియర్ లైన్మెన్ చరణ్ మృతి చెందారు. విజయవాడలో జరిగే ధర్నాకు వెళుతుండగా, వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో చరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్